Bharat Jodo Nyay Yatra: 100 లోక్‌సభ స్థానాలు.. 15 రాష్ట్రాలు.. 67 రోజులు.. భారత్ జోడో న్యాయ్ యాత్ర విశేషాలివే!

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra Starts Today In Manipur

  • ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నేడు యాత్ర ప్రారంభం
  • పదేళ్ల మోదీ ‘అన్యాయ్ కాల్’కి వ్యతిరేకంగా జరుగుతున్న యాత్రగా కాంగ్రెస్ అభివర్ణన
  • యూపీలో అత్యధికంగా 11 రోజులపాటు కొనసాగనున్న రాహుల్ పాదయాత్ర
  • మార్చి 20న మహారాష్ట్రలో ముగింపు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ నేడు మణిపూర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర మొత్తం 15 రాష్ట్రాలు, 100 లోక్‌సభ స్థానాలు, 110 జిల్లాల మీదుగా సాగుతుంది. 6,700 కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్ర మొత్తం 67 రోజులపాటు కొనసాగుతుంది. అలాగే, 337 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా యాత్ర సాగుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ యాత్ర గురించి కాంగ్రెస్ మాట్లాడుతూ.. నరేంద్రమోదీ 10 ఏళ్ల ‘అన్యాయ్ కాల్’కి వ్యతిరేకంగా జరుగుతున్న యాత్రగా దీనిని అభివర్ణించింది. ఈశాన్య రాష్ట్రంలో ప్రారంభమవుతున్న ఈ యాత్ర మార్చి 20న మహారాష్ట్రలో ముగుస్తుంది. 

ఉత్తరప్రదేశ్‌లో 1,074 కిలోమీటర్లు
రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్‌‌లో కొనసాగుతుంది. రాష్ట్రంలోని 20 జిల్లాల మీదుగా 1,074 కిలోమీటర్లపాటు 11 రోజులపాటు సాగుతుంది. ఝార్ఖండ్‌, అస్సాంలో 8 రోజుల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 7 రోజులపాటు యాత్ర కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయంగా అత్యంత ముఖ్యమైన యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసిలోనూ రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. బీహార్‌లో ఏడు జిల్లాలు, ఝార్ఖండ్‌లో 13 జల్లాలను కవర్ చేసే రాహుల్ యాత్ర ఆయా జిల్లాల్లో వరుసగా 425 కిలోమీటర్లు, 804 కిలోమీటర్లు కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News