Crime News: అబార్షన్‌కు యువతి నిరాకరణ.. స్క్రూ డ్రైవర్‌తో పొడిచి, బ్లేడ్‌తో గొంతుకోసిన యువకుడు

Man stabs pregnant woman for refused to abortion
  • ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఘటన
  • మూడేళ్లుగా నిందితుడితో రిలేషన్‌లో యువతి
  • దాడి తర్వాత ముఖాన్ని గుర్తుపట్టకుండా బండరాయితో ముఖంపై మోదిన నిందితుడు
  • వెంటిలేటర్‌పై చావుబతుకుల్లో బాధితురాలు
అబార్షన్ చేయించుకునేందుకు నిరాకరించిన యువతిపై ఆమె పార్ట్‌నర్ అయిన 19 ఏళ్ల యువకుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. స్క్రూడ్రైవర్‌తో పొడిచి, బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఢిల్లీలోని మయూర్ విహార్‌లో శనివారం జరిగిందీ ఘటన. బాధితురాలు ప్రస్తుతం లోక్‌నాయక్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. నిందితుడిని పోలీసులు యోగేశ్ ధేడాగా గుర్తించారు. వీరిద్దరూ మూడేళ్లుగా రిలేషన్‌లో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు.

ఓ ఆయుర్వేద క్లినిక్‌లో పనిచేస్తున్న యువతి గురువారం చిల్లా గ్రామంలోని ఫైర్ బ్రిగేడ్ కార్యాలయ సమీపంలో రక్తపు మడుగులో పడివుండగా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటలేటర్‌‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాడి తర్వాత ఆమె మృతి చెంది ఉంటుందని భావించిన నిందితుడు ఆమెను ఎవరూ గుర్తుపట్టకుండా బండరాయితో ముఖంపై మోది పరారయ్యాడు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.
Crime News
Delhi
Abortion
Pregnant Woman

More Telugu News