Nara Devansh: కల్యాణి డ్యామ్ వద్ద సందడి చేసిన నారా దేవాన్ష్... వీడియో ఇదిగో!

Nara Devansh visits Kalyani Dam

  • నారావారిపల్లె చేరుకున్న నారా, నందమూరి కుటుంబ సభ్యులు
  • సంక్రాంతి వేడుకలకు సమాయత్తం
  • నేడు కల్యాణి డ్యామ్ ను సందర్శించిన నారా, నందమూరి కుటుంబీకులు

నారా, నందమూరి కుటుంబ సభ్యులు సంక్రాంతి సంబరాల కోసం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె చేరుకున్నారు. కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ఇవాళ రంగంపేటకు సమీపంలోని కల్యాణి డ్యామ్ వద్ద  సందడి చేశాడు. నారా వారి కుటుంబ సభ్యులు, బంధువులు కల్యాణి డ్యామ్ ను సందర్శించారు. స్వర్ణముఖి నదిపై నిర్మించిన ఈ డ్యామ్ అందాలను వారు తిలకించారు. డ్యామ్ పై ఉత్సాహంగా కలియదిరిగారు. అక్కడి పరిసరాలను వారు ఎంతో ఆసక్తిగా తిలకించారు. కల్యాణి డ్యామ్ ను సందర్శించిన వారిలో నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర కూడా ఉన్నారు.

Nara Devansh
Kalyani Dam
Rangampeta
Naravaripalle
Sankranti

More Telugu News