DSC: త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్... మంత్రి బొత్స వెల్లడి

AP Govt set to announce DSC

  • సంక్రాంతి కానుకగా డీఎస్సీ ప్రకటన ఉంటుందన్న బొత్స
  • సీఎం జగన్ తోనూ మాట్లాడామని వెల్లడి
  • సంక్రాంతి తర్వాత ప్రకటన ఉంటుందని స్పష్టీకరణ

ఏపీలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ ప్రకటించనున్నట్టు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సీఎం జగన్ తోనూ నోటిఫికేషన్ గురించి మాట్లాడామని, పోస్టుల సంఖ్యపై స్పష్టత రాగానే, నోటిఫికేషన్ ఉంటుందని అన్నారు. ఏ ఏ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి, వాటి భర్తీ విధానాలను ఖరారు చేయాల్సి ఉందని బొత్స పేర్కొన్నారు. 

ఏపీలో గత కొన్నాళ్లుగా డీఎస్సీ ప్రకటన లేకపోవడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి లోనై ఉన్నారు. ఈ నేపథ్యంలో, త్వరలో నోటిఫికేషన్ వస్తే వారికి ఇది కచ్చితంగా తియ్యని వార్తే కానుంది.

DSC
Jagan
Botsa Satyanarayana
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News