Revanth Reddy: మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy meets Mallikarjuna Kharge

  • భేటీలో పాల్గొన్న రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షీ
  • పార్టీ పెద్దలతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై చర్చించిన సీఎం
  • త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. ఖర్గేతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి ఢిల్లీకి నిన్న చేరుకున్నారు. ఈ రోజు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.

Revanth Reddy
Congress
Telangana
Mallikarjun Kharge
  • Loading...

More Telugu News