Shahrukh Khan: 'గుంటూరు కారం' చిత్రంపై షారుఖ్ ఖాన్ స్పందన

Shahrukh Khan responds on Mahesh Babu Guntur Kaaram

  • సంక్రాంతి బరిలో రిలీజైన గుంటూరు కారం
  • ఈ సినిమాపై ఆసక్తి కలుగుతోందన్న షారుఖ్ ఖాన్
  • కృతజ్ఞతలు తెలిపిన మహేశ్ బాబు

సంక్రాంతి బరిలో వచ్చిన పెద్ద సినిమా 'గుంటూరు కారం'. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ ను కలిపి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న రిలీజైంది. 

కాగా, ఈ సినిమాపై బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ స్పందించారు. మహేశ్ బాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

"గుంటూరు కారం సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నాను మై ఫ్రెండ్ మహేశ్ బాబు. యాక్షన్, ఎమోషన్... వాటితో పాటే మాస్... ముట్టుకుంటే నిప్పు!" అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. 

కాగా, షారుఖ్ ఖాన్ పోస్టుపై మహేశ్ బాబు స్పందించారు. "షారుఖ్ ఖాన్... మీ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు, మీ ఇంట్లో వాళ్లందరికీ నా ప్రేమాభిమానాలు తెలియజేస్తున్నాను" అంటూ మహేశ్ వినమ్రంగా బదులిచ్చారు.

Shahrukh Khan
Guntur Kaaram
Mahesh Babu
Sankranti
  • Loading...

More Telugu News