Ram Charan: బెంగళూరులో సంక్రాంతి జరుపుకోనున్న రామ్ చరణ్, ఉపాసన

Ram Charan and Upasana off to Bengaluru for festive days

  • హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చిన రామ్ చరణ్, ఉపాసన
  • కుమార్తె క్లీంకార, పెంపుడు కుక్క రిథమ్ తో బెంగళూరు పయనం
  • ప్రస్తుతం 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్న గ్లోబల్ స్టార్

షూటింగ్ ఉంటే సెట్స్ పై, షూటింగ్ లేకపోతే ఇంట్లో... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైలీ రొటీన్ ఇలా ఉంటుంది. టాలీవుడ్ లో ఓ పక్కా ఫ్యామిలీ అంటే రామ్ చరణ్ పేరు చెప్పొచ్చు. కూతురు క్లీంకార పుట్టిన తర్వాత ఆయనకు తండ్రి హోదా రావడంతో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి. 

తాజాగా, కుమార్తెను భుజంపై పడుకోబెట్టుకుని తీసుకెళుతూ రామ్ చరణ్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. పక్కనే ఉపాసన తమ పెంపుడు కుక్క 'రిథమ్' ను పొదివి పట్టుకుని నడుస్తూ దర్శనమిచ్చారు. ఈ స్వీట్ కపుల్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్నారు. ఈ సంక్రాంతి వేడుకలను రామ్ చరణ్, ఉపాసన తమ తొలి సంతానం క్లీంకారతో కలిసి బెంగళూరులో జరుపుకుంటారని తెలుస్తోంది. 

మరోపక్క, రామ్ చరణ్ దంపతులతో పాటు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్, కుమార్తె ఆద్య కూడా బెంగళూరు పయనమైనట్టు సమాచారం. 

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటించనున్నారు.

More Telugu News