YS Sharmila: భట్టి అన్నా బాగున్నారా... మీరు డిప్యూటీ కావడం సంతోషంగా ఉంది: ప్రజాభవన్‌లో వైఎస్ షర్మిల

YS Sharmila Congratulates Deputy CM Mallu Bhatti Vikramarka
  • మల్లు భట్టి విక్రమార్కను కలిసిన వైఎస్ షర్మిల
  • తనయుడు రాజారెడ్డి పెళ్లి పత్రికను మల్లు భట్టికి అందించిన షర్మిల
  • తన కొడుకు వివాహానికి హాజరు కావాలని కోరిన కాంగ్రెస్ నాయకురాలు
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల శుక్రవారం తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను అందించేందుకు వచ్చిన షర్మిల ఆయనకు కుశల ప్రశ్నలు వేసి... డిప్యూటీ సీఎం అయినందుకు కంగ్రాట్స్ తెలిపారు. మల్లు భట్టిని ఆయన నివాసం ప్రజా భవన్‌లో షర్మిల కలిశారు. 'భట్టి అన్నా... బాగున్నారా? మీరు ఉపముఖ్యమంత్రి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది... కంగ్రాచ్యులేషన్స్' అంటూ ఆమె పలకరించారు.

ఆ తర్వాత తన కొడుకు వివాహానికి తప్పకుండా రావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కాగా, ఈ నెల 18న షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పలువురు ప్రముఖులకు వరుసగా పెళ్లి పత్రికలను అందిస్తున్నారు.
YS Sharmila
Mallu Bhatti Vikramarka
Congress
marriage

More Telugu News