Harish Rao: కాంగ్రెస్‌కు ట్రైలర్ చూపించాం... ఇక ముందు సినిమా చూపిస్తాం: హరీశ్ రావు

Harish Rao targets Congress party and kishan reddy

  • తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందన్న హరీశ్ రావు
  • తమ హయాంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని విమర్శలు
  • కార్యకర్తలను కాపాడుకోవడానికి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి
  • అక్రమ కేసుల నుంచి కాపాడుకోవడానికి లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్న హరీశ్ రావు

ఇటీవల శాసన సభలో కాంగ్రెస్ పార్టీకి తాము ట్రైలర్ మాత్రమే చూపించామని... ఇక ముందు సినిమాను చూపిస్తామని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ అంశాల్లో తమ హయాంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఇక ముందు వారికి సినిమాను చూపిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అక్రమ కేసుల నుంచి కాపాడుకోవడానికి లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసుకుంటామన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేదని విమర్శించారు.

Harish Rao
Congress
Telangana
BJP
  • Loading...

More Telugu News