Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
- 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనన్న రేవంత్ రెడ్డి
- గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడి
- కొత్త విద్యుత్ పాలసీ కోసం ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని సూచన
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన సచివాలయంలో అధికారులతో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... త్వరలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకు వస్తామని స్పష్టం చేశారు. ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు.
కొత్త విద్యుత్ పాలసీ కోసం ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అసెంబ్లీలో చర్చించి సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు. తక్కువ ధరకు విద్యుత్‌ను ఇచ్చే కంపెనీల నుంచి మనం కొనుగోలు చేయాలని... అందుకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.