Chandrababu: బూతులు తిట్టేవాళ్లకు జగన్ కొత్త కొత్త అవార్డులు ఇస్తున్నాడు: చంద్రబాబు

Chandrabu slams CM Jagan in Bobbili meeting

  • విజయనగరం జిల్లా బొబ్బిలిలో రా కదలిరా సభ
  • సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు
  • ఎవడెక్కువ తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు అంటూ వ్యాఖ్యలు

విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. బూతులు తిట్టేవాళ్లకు జగన్ కొత్త కొత్త అవార్డులు ఇస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"ఎక్కువ తిడితే బూతు శ్రీ... ఇంకా ఎక్కువ తిడితే బూతు రత్న... బూతు భూషణ్... బూతు సామ్రాట్! ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు... ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు! చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్... మా ముగ్గుర్ని తిట్టడంలో పోటీ పెట్టాడు! తిట్టు... నీకు సీటిస్తా! ఇదే జగన్ నినాదం. ఇది రోత రాజకీయం కాదా? ఇలాంటివి మీరు ఆమోదిస్తారా?" అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

Chandrababu
Jagan
Raa Kadali Raa
Bobbili
TDP
YSRCP
  • Loading...

More Telugu News