Mahesh Babu: నా సొంతూరులో నా సినిమా కార్యక్రమం ఎప్పటికీ మదిలో నిలిచిపోతుంది: మహేశ్ బాబు

Mahesh Babu says Thank You Guntur

  • మహేశ్ బాబు హీరోగా గుంటూరు కారం
  • జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్
  • నిన్న గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • "థాంక్యూ గుంటూరు" అంటూ ట్వీట్ చేసిన మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపుదిద్దుకున్న గుంటూరు కారం చిత్రం నిన్న గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంది. దీనిపై మహేశ్ బాబు ఇవాళ సోషల్ మీడియాలో స్పందించారు. 

"థాంక్యూ గుంటూరు... నా సొంతూరులో నా అభిమానుల ప్రేమాభిమానాల మధ్య నా సినిమా వేడుక జరుపుకోవడం ఓ కాలాతీత జ్ఞాపకంగా ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతుంది. నా సూపర్ అభిమానులారా మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాను... మరోసారి మిమ్మల్ని కలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాను... త్వరలోనే కలుస్తాను. ఇక సంక్రాంతి మొదలైంది!" అంటూ లవ్ ఎమోజీలతో మహేశ్ బాబు ట్వీట్ చేశారు. 

అంతేకాదు, తన పోస్టులో గుంటూరు పోలీసులను కూడా ప్రస్తావించారు. నిన్నటి ఈవెంట్ జయప్రదంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేందుకు సహకరించిన గుంటూరు పోలీస్ డిపార్ట్ మెంట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Mahesh Babu
Guntur Kaaram
Pre Release Event
Guntur
Tollywood
  • Loading...

More Telugu News