Brahmanandam: బ్రహ్మానందం ఆత్మకథపై రామ్ చరణ్ స్పందన

Ram Charan opines on Brahmanandam autobiography

  • తన జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చిన బ్రహ్మానందం
  • నేను మీ బ్రహ్మానందం పేరిట మార్కెట్లో సందడి చేస్తున్న ఆత్మకథ
  • పుస్తకం విశిష్టతను వివరించిన రామ్ చరణ్

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తన జీవిత కథను 'నేను... మీ బ్రహ్మానందం' పేరిట తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల కిందటే మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకం అమ్మకాల పరంగా దూసుకెళుతోంది. ఈ పుస్తకం ప్రముఖ ఈ-కామర్స్ పోర్టళ్లలోనూ లభ్యమవుతోంది. 

కాగా, బ్రహ్మానందం 'గేమ్ చేంజర్' సినిమా సెట్స్ పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కలిసి తన ఆత్మకథ పుస్తకాన్ని అందించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్... బ్రహ్మానందంకు అభినందనలు తెలిపారు. 

దీనిపై రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "నేను... అనే పేరుతో వచ్చిన బ్రహ్మానందం గారి ఆత్మకథలో ఆయన అపురూపమైన జీవనప్రస్థానాన్ని చూడొచ్చు. హాస్యంతోనూ, ఆర్ధ్రతతోనూ నగిషీలు చెక్కిన ఈ పుస్తకం హృదయానికి హత్తుకుంటుంది. ఈ పుస్తకంలోని ప్రతి పేజీ నవ్వుల పరిమళంతో పాటు జీవిత పాఠాలను, బ్రహ్మానందం గారు మనకందించిన సినీ సమ్మోహనాన్ని వెదజల్లుతుంది" అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 

అంతేకాదు, '' 'నేను... మీ బ్రహ్మానందం' పుస్తకాన్ని అమెజాన్ ద్వారా ఆర్డర్ చేయండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. ఆ మేరకు అమెజాన్ లింకును కూడా పంచుకున్నారు.

More Telugu News