Guntur Kaaram: మావా ఎంతైనా పర్లేదు బిల్లు... మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు... 'గుంటూరు కారం' నుంచి మరో సాంగ్

Another song released from Mahesh Babu starring Guntur Kaaram

  • మహేశ్ బాబు హీరోగా గుంటూరు కారం
  • త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం
  • జనవరి 12న రిలీజ్ 
  • నిన్న గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సంక్రాంతి బరిలో సత్తా చాటేందుకు ఉరకలు వేస్తున్నారు. ఆయన నటించిన 'గుంటూరు కారం' చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. 

కాగా, ఈ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజైంది. "మావా ఎంతైనా పర్లేదు బిల్లు... మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు" అంటూ సాగే ఈ పాటకు తమన్ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. కొమాండూరి రామాచారి, శ్రీకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటలో 'ది గోంగూర బ్యాండ్' వినిపించిన ఆంధ్రా డప్పు దరువు స్పెషల్ అని చెప్పాలి. 'గుంటూరు కారం' చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు.

More Telugu News