Mallu Bhatti Vikramarka: ఫార్ములా ఈ-రేస్‌తో మనకు ఎలాంటి ప్రయోజనం లేదు: మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhati Vikramarka counter to BRS over Formula E race
  • ఫార్ములా ఈ-రేస్ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందన్న మల్లు భట్టి
  • ప్రతి పైసా ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తామని స్పష్టీకరణ
  • ఈ-రేస్ పేరుతో ఓ కంపెనీ టిక్కెట్లు అమ్ముకొని లబ్ధి పొందిందని విమర్శలు
ఫార్ములా ఈ-రేస్‌తో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫార్ములా ఈ-రేస్‌పై మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఫార్ములా ఈ-రేస్ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఫార్ములా ఈ-రేస్‌కు అనుమతి లేదన్నారు. వాళ్లెవరో హైదరాబాద్‌కు వచ్చి... వెళ్లడానికి రూ.100 కోట్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ఇది బిజినెస్ రూల్స్‌కు భిన్నమైనదన్నారు.

ప్రతి పైసా రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్‌పై మాజీ మంత్రులు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ-రేస్ విషయంలో తమ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని... ఈ-రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టమని విమర్శలు చేస్తున్నారని.. కానీ అది వెనక్కి వెళ్లడంలో మనకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఓ కంపెనీ టిక్కెట్లు అమ్ముకొని లబ్ధి పొందిందని... ఇందులో ముగ్గురు వాటాదారులు ఉన్నారన్నారు.
Mallu Bhatti Vikramarka
Congress
BRS

More Telugu News