Deep fake video: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ‘బెల్లీ డ్యాన్స్’.. వైరల్‌గా మారిన డీప్ ఫేక్ వీడియో
- ఎర్రటి రంగు దుస్తులు ధరించి డ్యాన్స్ చేస్తున్నట్టుగా వీడియోను ఏమార్చిన వైనం
- జెలెన్స్కీ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తున్నారని ప్రచారం
- 2020 నాటి పాత వీడియోను డీప్ ఫేక్‌గా మార్చారని నిర్ధారణ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎర్రటి రంగు దుస్తులు ధరించి బెల్లీ డ్యాన్స్ చేస్తున్నట్టుగా సృష్టించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజంగా ఆయనే డ్యాన్స్ చేస్తున్నారేమో అనిపించేలా ఉన్న ఈ వీడియో ఫేక్ అని తేలింది. 16 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించి రష్యన్ భాషలో క్యాప్షన్ ఇచ్చి వైరల్‌గా మార్చారు.
అసలు ఫుటేజ్‌లో గుర్తుతెలియని ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నట్టుగా తేలింది. 2020 నాటి పాత వీడియో అని తేలింది. డీప్ ఫేక్ వీడియోలో జెలెన్స్కీ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. విధ్వంసకారుడిగా ముద్రవేసే ప్రయత్నం చేశారు. కాగా రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు జెలెన్స్కీ వినోదరంగంలో ప్రతిభ చాటుకున్నారు. పలు సినిమాల్లో నటించడంతో పాటు డ్యాన్స్ షోలలో పాల్గొన్నారు.