Special Song: టీడీపీ-జనసేన 'రా కదలిరా' ప్రత్యేక గీతం విడుదల

TDP and Jansena special song released

  • ఏపీలో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన
  • ఇప్పటికే రా కదలి రా సభలు
  • తాజాగా ప్రత్యేక గీతం రూపకల్పన

ఏపీలో ఎన్నికల పొత్తు నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు కలసికట్టుగా కదం తొక్కుతున్నాయి. రా కదలి రా పేరిట అప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తుండగా... తాజాగా భాగస్వామ్య స్ఫూర్తితో ఎలక్షన్ స్పెషల్ సాంగ్ ను నేడు విడుదల చేశారు. 

"నినదించర గళం విప్పి, నిలదీయర గల్ల పట్టి... నిలవాలిర పిడికిలెత్తి... తెలుగుదేశ సైనికా...!
ప్రతి అడుగొక పిడుగులాగ... గెలుపు మోకరిల్లే దాక... ప్రతినబూని కదలి రారా... జనసేన సేవకా...!
అభివృద్ధికి అర్థమైన దార్శనికుని (చంద్రబాబు) స్ఫూర్తిగా...
రాష్ట్ర ప్రగతే ముఖ్యమన్న పవనన్నకి అండగా...
ఉడుకెత్తిన నెత్తురే ఒకనిప్పుటేరు (లోకేశ్) లాగ... 
కదిలిరా... కదలిరా... కదలిరా... 
పిలుస్తోంది పిలుస్తోంది తెలుగుదేశం రారా
పదం కలిపి నడుస్తోన్న జనసేనతో రారా..." అంటూ ఈ గీతం సాగుతుంది.

More Telugu News