Devara: ఈ సముద్రం చేపల కంటే కత్తులను .. నెత్తురును ఎక్కువగా చూసుంటుంది: 'దేవర' గ్లింప్స్ రిలీజ్

Devara movie glimpse released

  • 'దేవర' నుంచి వచ్చిన గ్లింప్స్ 
  • సముద్రం నేపథ్యంలో నడిచే కథ 
  • ఆసక్తిని పెంచుతున్న విజువల్స్ 
  • హైలైట్ గా నిలుస్తున్న ఎన్టీఆర్ డైలాగ్ 
  • ఏప్రిల్ 5వ తేదీన విడుదల     


ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో 'దేవర' సినిమా రూపొందుతోంది. యువసుధ ఆర్ట్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్ గా ఉండటం .. చిత్రమైన ఆయుధాలతో ఆయన పోస్టర్స్ పై కనిపిస్తూ ఉండటం ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచుతోంది. 

అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. పడవలపై కొంతమంది సముద్రంలోకి వెళ్లడం .. షిప్ ను చుట్టుముట్టి దానిలోని సరుకును కాజేయడం చూపించారు. సముద్రపు దొంగల నేపథ్యంలో సాగే కథగా ఇది కనిపిస్తుంది. ఆ దొంగలతో హీరో పోరాడటం చూపించారు. 

వెన్నెల రాత్రిలో సముద్రం నేపథ్యంలో సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'ఈ సముద్రం చేపలకంటే కత్తులను .. నెత్తురును ఎక్కువగా చూసి ఉంటుంది. అందుకే దీనిని ఎర్రసముద్రం అంటారు' అనే ఎన్టీఆర్ డైలాగ్ కంటెంట్ పై మరింత కుతూహలాన్ని పెంచుతోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.

Devara
Ntr
Janhvi Kapoor
Koratala Siva

More Telugu News