KIran Abbavaram: 1980 నాటి కాలంలోకి తీసుకెళ్లనున్న కిరణ్ అబ్బవరం!

Kiran Abbavaram larest Movies

  • దూకుడుగా ఇండస్ట్రీకి వచ్చిన కిరణ్ అబ్బవరం
  • ఆశించిన స్థాయిలో దక్కని విజయాలు 
  • లవ్ స్టోరీ నేపథ్యంలో చేస్తున్న 'దిల్ రుబా'
  • 1980 నాటి కాలంలో పోస్టుమేన్ గా కొత్తలుక్  


కిరణ్ అబ్బవరం హీరోగా ఎంట్రీ ఇస్తూనే తన దూకుడు చూపించాడు. పెద్ద పెద్ద బ్యానర్లలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. అయితే వరుస విజయాలను మాత్రం అందుకోలేకపోయాడు. 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ఫరవాలేదనిపించుకున్నా, 'నేను మీకు బాగా కావలసినవాడిని' .. 'మీటర్' .. 'రూల్స్ రంజాన్' మాత్రం నిరాశపరిచాయి. 

డాన్సులలోను .. ఫైట్స్ విషయంలోను కాస్త రాటుదేలిన కిరణ్ అబ్బవరం, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను సెట్ చేసుకునే పనిలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ రెండింటిలో ఒకదాని టైటిల్ 'దిల్ రుబా'. ఈ సినిమాతో కరుణ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 

ఇక ఆ తరువాత సినిమాను సందీప్ - సుజీత్ అనే దర్శక ద్వయంతో కలిసి పనిచేస్తున్నాడు. ఈ కథ 1980 నాటి కాలంలో నడుస్తుందట. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోస్టుమేన్ గా కనిపించనున్నాడని అంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథ ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకుని వెళుతుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. 

More Telugu News