Jabardasth Avinash: బిడ్డను కోల్పోయిన కమెడియన్ అవినాశ్

Jabardasht Avinash loses child

  • అవినాశ్ భార్యకు అబార్షన్
  • సోషల్ మీడియాలో వెల్లడించిన కమెడియన్
  • అమ్మానాన్న అనిపించుకోవడానికి ఎంతో ఆశగా ఎదురుచూశామని వెల్లడి
  • కానీ ఈ ఘటన తమను విషాదానికి గురిచేసిందని వివరణ

జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చి, ఆపై బిగ్ బాస్ ద్వారా మరింత పాప్యులర్ అయిన ప్రముఖ కమెడియన్ అవినాశ్ కుటుంబంలో నిరాశ అలముకుంది. అవినాశ్ అర్ధాంగి అనూజకు అబార్షన్ జరిగింది. బిడ్డకు జన్మనివ్వడం అనేది ఎవరికైనా ఒక మధురానుభూతి. కానీ, తాము ఆ అదృష్టాన్ని కోల్పోయామని అవినాశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

తన భార్యకు అబార్షన్ జరిగిందని, బిడ్డ భూమ్మీదకు రాకుండానే కోల్పోయామని తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. బాధ అయినా, సంతోషం అయినా... తన జీవితంలో అభిమానులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, అందుకే ఈ విషాదకర వార్తను అభిమానులతో పంచుకుంటున్నానని అవినాశ్ వివరించాడు. 

అమ్మానాన్న అనిపించుకోవాలని తాను, తన భార్య ఎంతో ఆరాటపడ్డామని, కొన్ని కారణాల వల్ల బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పాడు.

Jabardasth Avinash
Child
Wife
Comedian
  • Loading...

More Telugu News