ESL Narasimhan: కేసీఆర్ నివాసానికి వెళ్లిన మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు

Former governor ESL Narasimhan and his wife visits CM KCR
  • ఎన్నికల తర్వాత బాత్రూంలో జారిపడిన కేసీఆర్
  • తుంటి ఎముకకు శస్త్రచికిత్స
  • తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్
  • కేసీఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నంది నగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ నేపథ్యంలో, మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇవాళ సతీసమేతంగా కేసీఆర్ నివాసానికి వచ్చారు. క్రమంగా కోలుకుంటున్న కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్యవంతులు కావాలంటూ ఆకాంక్షించారు. కాగా, కేసీఆర్ నివాసానికి వచ్చిన నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు.
ESL Narasimhan
KCR
Former Governor
Hyderabad
Telangana

More Telugu News