Narendra Modi: లక్షద్వీప్ లో ప్రధాని మోదీ విహారంపై సల్మాన్ ఖాన్ స్పందన

Salman Khan comments on PM Modi Lakshdweep tour

  • లక్షద్వీప్ లో మోదీ పర్యటన
  • అందమైన బీచ్ లలో విహారం
  • రమణీయమైన బీచ్ లలో ప్రధానిని చూడడం ఆహ్లాదకరంగా ఉందన్న సల్మాన్

ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో విహరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మోదీ తన పర్యటనలో భాగంగా ఇక్కడి బీచ్ లో స్నార్కెలింగ్ కూడా చేశారు. దాంతో ప్రధానిని కొనియాడుతూ అనేకమంది సందేశాలు పంపుతున్నారు. తాజాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాని మోదీ లక్షద్వీప్ టూర్ పై సోషల్ మీడియాలో స్పందించారు.లక్షద్వీప్ లోని రమణీయమైన సముద్ర తీరంలో ప్రధాని నరేంద్ర మోదీని చూడడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని సల్మాన్ పేర్కొన్నారు. అద్భుతమైన విషయం ఏమిటంటే ఇంత అందమైన బీచ్ లతో కూడిన లక్షద్వీప్ మన భారతదేశంలోనే ఉందని వివరించారు.

Narendra Modi
Lakshdweep
Salman Khan
India
  • Loading...

More Telugu News