: 'బికినీ' ప్రియులకు చేదువార్త!
అతివలు తమ ఒంపు సొంపులను అతి రమ్యంగా ప్రదర్శిస్తుంటే ఆస్వాదించని వారు ఎవరుంటారు..? కాస్తంత అంగ సౌష్టవం ఉన్న సుందరాంగులు బికినీలో కనిపిస్తే చాలు.. గంగవెర్రులెత్తే పురుష పుంగవులకు కొదవేలేదు. ఇక ప్రపంచవ్యాప్త అందగత్తెలందరూ ఒకే వేదికపై వయ్యారాలు ఒలకబోస్తుంటే.. బికినీలో ఒకరి తర్వాత ఒకరు నయనానందకరంగా నడిచొస్తుంటే.. 'ఆహా', 'ఓహో'లు పరాకాష్టకు చేరుకుంటాయి. 'మిస్ వరల్డ్' పోటీల్లో ఇప్పటివరకు జరిగిందిదే. కానీ, ఈసారి ఆ చాన్స్ లేదండోయ్!
కొన్ని ఇస్లామిక్ దేశాల్లో అందాల పోటీల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న దృష్ట్యా.. 'మిస్ వరల్డ్' పోటీల్లో 'బికినీ రౌండ్' ఎత్తివేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇది నిజంగా బికినీ ప్రియులకు చేదువార్తే కదూ. ఎందుకంటే, అన్ని దేశాలకు చెందిన సొగసుకత్తెలను 'టూ పీస్' డ్రెస్ లో చూసి తరించడం ఎప్పుడోగానీ సాధ్యపడదు. ఈసారి 'ప్రపంచసుందరి' పోటీలకు ఆతిథ్యమిస్తోంది ఇండోనేషియా కాబట్టి, ఈ చర్య తప్పనిసరి అని మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థ చైర్ పర్సన్ జూలియా మోర్లే వివరణ ఇచ్చారు.
కాగా, వచ్చే సెప్టెంబర్ లో ఈ పోటీలు జరగనున్నాయి. ఆసియాలో ప్రముఖ పర్యాటక స్థలంగా పేరుగాంచిన ఇండోనేషియాలో అత్యధికులు ముస్లింలే. దీంతో, సహజంగానే అక్కడ మహిళలపై ఆంక్షలెక్కువగా ఉంటాయి.