Gangster Killed: సొంత గ్యాంగ్ చేతిలోనే హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్

Gangster Mohol killed by own gang

  • పూణేలో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో హత్య
  • పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన వైనం
  • 8 మంది అనుమానితుల అరెస్ట్
  • ఇది గ్యాంగ్‌వార్ కాదన్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

పూణేకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 8 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు పిస్తోళ్లు, మూడు మ్యాగజైన్లు, ఐదు రౌండ్ల బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 1.30 సమయంలో సుతార్దారా ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ మొహొల్‌ (40)పై నలుగురు దుండగులు పాయింట్ రేంజ్‌లో కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ అతడి చాతీని చీల్చేయగా, మరో రెండు అతడి కుడిభుజంలోకి చొచ్చుకెళ్లాయి. కోత్రుద్‌‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో  మొహొల్ చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు. 

మొహొల్‌పై పలు హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది మొహమ్మద్ ఖతీల్ సిద్ధిఖీని యరవాడ జైలులో హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డాడు. కాగా, మొహొల్ హత్యకు భూ తగాదాతోపాటు డబ్బులకు సంబంధించిన గొడవే కారణమని పోలీసులు తెలిపారు. ఇది గ్యాంగ్‌వార్ కాదని, సొంత గ్యాంగ్ చేతిలోనే మొహొల్ హత్యకు గురయ్యాడని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

Gangster Killed
Pune
Gangster Mohol
Maharashtra
  • Loading...

More Telugu News