Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం భద్రతలో పాల్గొనే సిబ్బంది స్మార్ట్‌ఫోన్‌లు వాడకూడదు

Police personnel should not use smartphones on Prana Pratishtha Day in Ayodhya says police

  • భద్రతలో పాల్గొనే భద్రతా సిబ్బందికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సూచన
  • ప్రకటన విడుదల చేసిన ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్
  • అయోధ్యలో ముమ్మరంగా కొనసాగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ఏర్పాట్లు

అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠాపన వేడుకల భద్రతలో పాల్గొననున్న భద్రతా సిబ్బంది స్మార్ట్‌ఫోన్లు వాడకూడదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ నెల 22 (సోమవారం)న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశ, విదేశాల నుంచి పలువురు వీవీఐపీ అతిథులు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ఠ భద్రతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేడుకకు ఒక వారం ముందు జనవరి 16 నుంచి వైదిక ఆచార కార్యక్రమాలు మొదలుకానున్నాయి.

More Telugu News