Maharashtra: మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం సమక్షంలో పోలీసు అధికారిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే

BJP MLA slaps police personnel in presence of Deputy CM in Maharashtra

  • ఓ కార్యక్రమ వేదిక నుంచి తిరిగి వెళ్తూ సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
  • డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమక్షంలో దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

మహారాష్ట్రలోని పూణేలో శుక్రవారం షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నగరంలోని సాసూన్ హాస్పిటల్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే దురుసుగా ప్రవర్తించారు. పోలీసు సిబ్బందిలోని ఓ అధికారిపై ఆయన చేయిచేసుకున్నారు. సహనం కోల్పోయి చెంపదెబ్బ కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్యక్రమం ముగిసిన తర్వాత సునీల్ కాంబ్లే వేదిక నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. వేదిక దిగుతున్న క్రమంలో నిలబడి ఉన్న పోలీసు సిబ్బందిపై కోపంతో ఉద్దేశపూర్వకంగా చెంపదెబ్బ కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన జరిగిన సమయంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వేదికపైనే ఉన్నారు.

More Telugu News