Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

Revanth Reddy meets Rajnath Singh

  • ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్రమంత్రులను కలుస్తున్న ముఖ్యమంత్రి
  • నిన్న అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరీ, గజేంద్ర సింగ్ షెకావత్‌లతో సమావేశం
  • నేడు రాజ్‌నాథ్‌తో రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ అంశాలపై చర్చ

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఏఐసీసీ నిర్వహించిన లోక్ సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనడానికి వచ్చిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రెండురోజులుగా వరుసగా కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. నిన్న అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరీ, గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులను కలిశారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలోని రక్షణ శాఖ భూములు... కంటోన్మెంట్ అంశాలపై చర్చించారు.

Revanth Reddy
Congress
Raj Nath Singh
BJP
  • Loading...

More Telugu News