Yatra 2 Teaser: 'ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్'.. 'యాత్ర 2' టీజర్ ఇదిగో!

Yatra 2 movie teaser out

  • ఫిబ్రవరి 8న విడుదలవుతున్న 'యాత్ర 2'
  • వైఎస్ మరణానంతర పరిణామాలను జగన్ ఎలా ఎదుర్కొన్నారనే దానిపై చిత్రం
  • సోనియాగాంధీ, చంద్రబాబే మెయిన్ టార్గెట్

సీఎం జగన్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'యాత్ర 2' సినిమా టీజర్ విడుదలయింది. వైఎస్ మరణానంతర పరిణామాలను జగన్ ఎలా ఎదుర్కొన్నారనే దానిపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి, జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ చిత్రంలో చంద్రబాబు, సోనియాగాంధీ తదితర ప్రముఖ నేతలను కూడా చూపించారు. చంద్రబాబు పాత్రను బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రను సుజానే బెర్నెర్ట్ పోషించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎలా వ్యవహరించారు? ఆయనను అణచి వేసేందుకు సోనియా, చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది ఈ చిత్రంలో ప్రధానంగా చూపించినట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది. 

Yatra 2 Teaser
Tollywood
Mammootty
Jiiva
Jagan
Chandrababu
Sonia Gandhi

More Telugu News