Chandrababu: వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో ఈ సదస్సు ద్వారా తెలియజేస్తున్నాం: చంద్రబాబు

Chandrababu held Jayaho BC seminar in Amaravati
  • జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన టీడీపీ
  • చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు
  • జయహో బీసీ కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామన్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ తాజాగా జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో, వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జయహో బీసీ సదస్సు ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. జయహో బీసీ కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామని... జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రచించామని చంద్రబాబు వివరించారు.
Chandrababu
Jayaho BC
Amaravati
TDP
Andhra Pradesh

More Telugu News