Dhulipala Narendra Kumar: నిన్ను గుడ్డిగా నమ్మిన గుడివాడ అమర్నాథ్ ను కూడా ఏడిపించేశావు జగన్ రెడ్డి: ధూళిపాళ్ల నరేంద్ర

Dhulipala Narendra shares video of Gudivada Amarnath

  • గుడివాడ అమర్నాథ్ ను పక్కన పెట్టిన జగన్
  • జగన్ ను చూసుకుని చంద్రబాబు, పవన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని వ్యాఖ్య
  • చివరకు వెక్కివెక్కి ఏడుస్తున్నాడని ఎద్దేవా

పలువురు సిట్టింగ్ లకు టికెట్లను నిరాకరిస్తుండటం లేదా మరో నియోజకవర్గానికి మారుస్తుండటం వైసీపీలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఇతర పార్టీల వైపు కూడా చూస్తున్నారు. జగన్ పక్కన పెట్టేసిన వారిలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా ఉన్నారు. తాజాగా ఈ అంశంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఎక్స్ వేదికగా స్పందిస్తూ... జగన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవరికైనా ఇదే గతి అని అన్నారు. నిన్ను గుడ్డిగా నమ్మిన గుడివాడ అమర్నాథ్ ను కూడా ఏడిపించేశావు కదా జగన్ అని విమర్శించారు. నిన్ను చూసుకుని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అమర్నాథ్ అవాకులు, చవాకులు పేలాడని... చివరకు తనను గాలిలో నిలబెట్టేసరికి ఇలా వెక్కివెక్కి ఏడుస్తున్నాడంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

Dhulipala Narendra Kumar
Telugudesam
Gudivada Amarnath
Jagan
YSRCP

More Telugu News