Hanu Man: చిరంజీవి చీఫ్ గెస్టుగా 'హను మాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్!

Hanu Man Movie Pre Release Event

  • సంక్రాంతి బరిలో పెరుగుతున్న సందడి 
  • ఈ నెల 12న రిలీజ్ అవుతున్న 'హను  మాన్'
  • మెగా టచ్ ఉంటుందని చెప్పిన నిర్మాత 
  • 7వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్


సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరూ కూడా కొత్త సినిమాల కోసం వెయిట్ చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ సంక్రాంతికి అందరిలో మరింత ఎక్కువ జోరే కనిపిస్తుంది. అందుకు కారణం వరుసబెట్టి స్టార్స్ సినిమాలు ఒక్కొక్కటిగా రంగంలోకి దిగుతూ ఉండటమే. అయితే పిల్లలంతా కూడా ఈ నెల 12న రానున్న 'హను మాన్' సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టారు.

సహజంగానే పిల్లలు సూపర్ హీరో కాన్సెప్ట్ తో కూడిన కథలను .. సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి సూపర్ హీరోలకు ఆద్యుడు హనుమంతుడు కావడం .. ఆయన అనుగ్రహంతో హీరో వీరోచిత విన్యాసాలు చేయడమనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందడం ప్రధానమైన కారణంగా చెప్పాలి. 

ఇక ఈ సినిమాలో మెగా టచ్ కూడా కనిపిస్తుందని చెబుతూనే సస్పెన్స్ లో పెట్టారు. హనుమంతుడు అంటే మెగాస్టార్ కి చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డితోను ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఈ నెల 7వ తేదీన జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన చీఫ్ గెస్టుగా రానున్నారు. అందువలన మేకర్స్ దీనిని 'మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్' గా పేర్కొంటూ, అధికారిక పోస్టర్ ను వదిలారు.

Hanu Man
Chiranjeevi
Niranjan Reddy
Prashanth Varma
  • Loading...

More Telugu News