Raghavendra Rao: బన్నీ ఆ 100 రూపాయలు అలాగే దాచుకున్నాడు: రాఘవేంద్రరావు

Raghavendra Rao Interview

  • తాజా ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు 
  • తాను పరిచయం చేసిన వాళ్లంతా స్టార్స్ అయ్యారని వ్యాఖ్య
  • పిల్లలపై చిరంజీవి ప్రభావం చూపించారని వివరణ  
  • అప్పట్లోనే బన్నీ డాన్సులు బాగా చేసేవాడని వెల్లడి  


రాఘవేంద్రరావు తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక భారీ విజయాలను అందిస్తూ వెళ్లారు. 'కలియుగ పాండవులు'తో వెంకటేశ్ ను ..  'రాజకుమారుడు'తో మహేశ్ బాబును .. 'గంగోత్రి'తో బన్నీని హీరోలుగా పరిచయం చేశారు. తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. 

"ఏఎన్నార్ డాన్సులను అందరూ ఎంజాయ్ చేసేవారు. కానీ పిల్లలు డాన్సులు చేయడమనేది .. చిరంజీవి డాన్సులను చూసిన తరువాతనే మొదలైంది. పిల్లలపై చిరంజీవి అలాంటి ప్రభావాన్ని చూపించారు. ఒకసారి చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ సందర్భంగా నేను వెళ్లడం జరిగింది. అక్కడ వాళ్ల ఫ్యామిలీలో పిల్లలంతా డాన్సులు చేశారు.  

అందరిలో బన్నీ చాలా బాగా చేశాడు. నాకు చాలా ముచ్చటగా అనిపించి, 'వీడు పెద్దయిన తరువాత పెద్ద స్టార్ అవుతాడు అని చెప్పి 100 రూపాయలు ఇచ్చాను. ఆ విషయం నేను మరిచిపోయాను. ఇటీవల బన్నీ వాళ్ల అమ్మగారు నాకు ఆ విషయం గుర్తు చేశారు. బన్నీ ఆ 100 రూపాయలు అలాగే దాచుకున్నాడని చెప్పారు" అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

Raghavendra Rao
Chiranjeevi
Venkatesh Daggubati
Allu Arjun
  • Loading...

More Telugu News