Darshan: భారీ వసూళ్ల దిశగా కన్నడ మూవీ 'కాటేరా'

Kaatera Movie Update

  • డిసెంబర్ 29వ తేదీన విడుదలైన 'కాటేరా'
  • కన్నడలో భారీ హిట్ గా నిలిచిన సినిమా 
  •  హీరో దర్శన్ కెరియర్లోనే భారీ వసూళ్లు
  • 1970లో హంపీలో జరిగిన సంఘటన కథకి ఆధారం 


కన్నడ స్టార్ హీరోల జాబితాలో దర్శన్ కనిపిస్తాడు. అక్కడ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ .. ఫాలోయింగ్ ఉన్నాయి. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ వెళ్లడం ఆయన ప్రత్యేకత. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కాటేరా' డిసెంబర్ 29వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. 

45 కోట్ల బడ్జెట్ తో రాక్ లైన్ వెంకటేశ్ ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ టైమ్ కి హైప్ పెంచుతూ వెళ్లారు. అందుకు తగినట్టుగానే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. దర్శన్ కెరియర్ లోనే ఇది పెద్ద హిట్ అని చెబుతున్నారు.

తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 1970లలో 'హంపీ'లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందింది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడిచే ఈ కథకి ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. కంటెంట్ పరంగా 'కేజీఎఫ్' .. 'కాంతార' సినిమాల సరసన ఈ సినిమా నిలిచిందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు వదులుతారనేది చూడాలి. 

Darshan
Aradhana Ram
jagapathi Babu
  • Loading...

More Telugu News