Jagan: రాబోయే రోజుల్లో రాజకీయ కుట్రలకు తెరతీస్తారు: సీఎం జగన్‌

Jagan fires on Jagan

  • చంద్రబాబు హయాంలో లంచాలు ఇస్తేనే పని జరిగేదన్న జగన్
  • బాబు అవినీతిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్న
  • జైలుకు వెళ్లి బాబును పరామర్శించిన ఘనత పవన్ దని ఎద్దేవా

గత చంద్రబాబు ప్రభుత్వంలో లంచాలు ఇస్తేనే ప్రజలకు పని జరిగేదని ఏపీ సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారని... పేద వారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. బాబు అవినీతిలో పవన్ కు భాగస్వామ్యం ఉండబట్టే ఆయన ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిని ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 చూపించవని విమర్శించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకు వెళ్లి పరామర్శించిన ఘనత పవన్ ది అని అన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ కుట్రలకు తెరతీస్తారని... పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని చెప్పారు. వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం తనకు రాదని అన్నారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు.

Jagan
YSR Vahana Mithra
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
  • Loading...

More Telugu News