ias: తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ... ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్

26 IAS transfers in Telangana state

  • ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
  • గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా నియామకం
  • వెయిటింగ్ లిస్టింగ్‌లో ఉన్న పలువురికి పోస్టింగ్‌లు

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్, సాగునీటి శాఖ క్యాదర్శిగా రాహుల్ బొజ్జాలను బదిలీ చేసింది. ఇటీవలి వరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్‌ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న దివ్య, భారతి హోలికేరి, చిట్టెం లక్ష్మి తదితరులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. పలువురు కలెక్టర్లను బదిలీ చేసింది.. మరికొందరికి కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది.

ias
Telangana
Congress
  • Loading...

More Telugu News