Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ కు ఆహ్వానం

Pawan Kalyan invited to Ayadhya Ram Mandhir inauguration
  • జనసేనానికి ఆహ్వాన పత్రికను అందించిన ఆరెస్సెస్ ప్రాంత సంపర్క్ ప్రముఖ్ జగన్
  • జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ ‌ను కలిసిన ప్రముఖులు
  • అయోధ్య రామమందిరం నిర్మాణ విశేషాలను జనసేనానికి తెలిపిన ఆరెస్సెస్ ప్రముఖులు
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆరెస్సెస్ ప్రాంత సంపర్క్ ప్రముఖ్ ముళ్లపూడి జగన్... జనసేనానికి అందించారు. బుధవారం మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ ‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ భేటీలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ఆరెస్సెస్ కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌కు ఆహ్వాన పత్రికను అందించి... అయోధ్య రామమందిరం నిర్మాణ విశేషాలను తెలిపారు. ఇదిలా ఉండగా అయోధ్య రామమందిర నిర్మాణం ప్రారంభించగానే పవన్ కల్యాణ్ రూ.30 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌కు అందించారు.
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
Pawan Kalyan
Janasena

More Telugu News