Revanth Reddy: అమరరాజా కంపెనీకి సహకరిస్తాం... సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy and Sridhar Babu participated in a meeting with the delegation of Amar Raja Group

  • అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలను ప్రోత్సహిస్తామన్న సీఎం  
  • విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందన్న గల్లా జయదేవ్
  • గిగా కారిడార్‌కు ప్రభుత్వ సహకారం అభినందనీయమని వ్యాఖ్య

అధునాతన సాంకేతికతను ఉపయోగించే అమరరాజా వంటి కంపెనీలకు ప్రోత్సాహం ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులతో బుధవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమరరాజాకు చెందిన గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో అమరరాజా కంపెనీది కీలక పాత్ర అన్నారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉందని తెలిపారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలకు ప్రోత్సాహం ఉంటుందన్నారు.

అనంతరం గల్లా జయదేవ్ మాట్లాడుతూ... గిగా కారిడార్‌కు ప్రభుత్వం ఇస్తోన్న సహకారం అభినందనీయమన్నారు. తమ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు ఈ ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. తమ వ్యాపారాలను మరింతగా విస్తరిస్తామని... విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందన్నారు.

  • Loading...

More Telugu News