Bellamkonda Srinivas: 'టైసన్ నాయుడు'గా విజృంభించిన బెల్లంకొండ శ్రీనివాస్ .. గ్లింప్స్ రిలీజ్!

Tyson Naidu title poster released

  • బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'టైసన్ నాయుడు'
  • మరో సారి పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న హీరో 
  • ఆసక్తిని రేపుతున్న ఫస్టు గ్లింప్స్ 
  • దర్శకుడిగా సాగర్ కె చంద్ర


బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం నుంచి టైటిల్ ను .. ఆయన ఫస్టులుక్ ను .. ఫస్టు గ్లింప్స్ ను విడుదల చేశారు. 'టైసన్ నాయుడు' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ... బెల్లంకొండ సురేశ్ యాక్షన్ స్టిల్ ను ఫస్టులుక్ గా రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది.

 ఒక వైపున బాక్సర్ గాను .. మరో వైపున పోలీస్ ఆఫీసర్ గాను బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తున్నాడు. బెల్లంకొండ లుక్ లో పెద్దగా మార్పు లేదు గానీ, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనే విషయం మాత్రం అర్థమవుతోంది. భారీ బడ్జెట్ తో రామ్ ఆచంట - గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 గతంలో పవన్ కల్యాణ్ హీరోగా 'భీమ్లా నాయక్' సినిమాను తెరకెక్కించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 'ఛత్రపతి' రీమేక్ అంటూ శ్రీనివాస్ బాలీవుడ్ వైపు వెళ్లడం వలన కాస్త గ్యాప్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఇక తన జోరును కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.


Bellamkonda Srinivas
Sagar Chandra
Tyson Naidu Movie

More Telugu News