12th Fail: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘ట్వెల్త్ ఫెయిల్’ ప్రభంజనం.. మూడు రోజుల్లో ఏడాది రికార్డులు బద్దలు!

12th Fail Movie Becomes Disney Plus Hoststar Most Watched Film In 2023

  • బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా రూపొందించిన ‘ట్వెల్త్ ఫెయిల్‘
  • రూ. 20 కోట్లతో తీస్తే ప్రపంచవ్యాప్తంగా 66.5 కోట్ల వసూలు
  • ప్రమోషన్ లేకున్నా నోటిమాట ద్వారానే బాక్సాఫీస్ విజయం
  • ఓటీటీలో చూసేందుకు పోటెత్తిన మిలియన్ల మంది

బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా రూపొందించిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ రికార్డుల వర్షం కురిపించింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబరు 29న విడుదలైన ఈ మూవీ మూడు రోజుల్లోనే 2023 ఏడాది రికార్డులు మొత్తాన్ని తుడిచిపెట్టేసి అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన సినిమాగా రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. 

రూ. 20 కోట్లతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 52 రోజుల్లోనే రూ.66.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. నటుడు విక్రాంత్ మాసే.. మనోజ్‌కుమార్‌శర్మగా నటించాడు. 12వ తరగతి ఫెయిలైన మనోజ్‌కుమార్ ఆ తర్వాత ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్ లేనప్పటికీ నోటి మాట ద్వారానే అద్భుత విజయాన్ని అందుకుంది. 

సినిమా కేవలం 600 స్క్రీన్లలోనే విడుదల కావడంతో చాలామంది ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయారు. దీంతో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన కాసేపటికే చూసేందుకు మిలియన్ల మంది పోటెత్తారు.  ఈ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన మూడు రోజుల్లోనే ఏడాది రికార్డులు మొత్తాన్ని కొల్లగొట్టిందని డిస్నీప్లస్‌హాట్‌స్టార్ తెలిపింది. ట్వెల్త్ ఫెయిల్ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన స్ఫూర్తిదాయక సినిమా.

More Telugu News