Saindhav: మా నాన్న ఉండగా నాకేం కాదు: 'సైంధవ్' ట్రైలర్ డైలాగ్

Saindhav movie trailer released

  • శైలేశ్ కొలను రూపొందించిన 'సైంధవ్' 
  • యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా సాగే కథ
  • ఆసక్తిని రేపుతున్న భారీ తారాగణం 
  • ఈ నెల 13వ తేదీన విడుదల కానున్న సినిమా  


వెంకటేశ్ - శైలేశ్ కొలను కాంబినేషన్లో రూపొందిన 'సైంధవ్' సినిమా ఈ నెల 13వ తేదీన ఆడియన్స్ ముందుకు రానుంది. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా నుంచి, కొంత సేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

ఈ కథ తండ్రీ కూతుళ్ల మధ్య గల ఎమోషన్స్ నేపథ్యంలో నడుస్తుందనే విషయం అర్థమవుతోంది. హీరో కూతురు నరాలకు సంబంధించిన ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. అందుకు అవసరమైన ఇంజక్షన్ ఖరీదు 17 కోట్లు. ఆ పాప మాత్రం తన కోసం తండ్రి ఏదైనా చేయగలడు .. తన తండ్రి ఉండగా తనకేం కాదు అనే నమ్మకంతో ఉంటుంది. 

 ఆ ఇంజక్షన్ హీరోకి దొరక్కుండా కొంతమంది స్వార్థపరులు అడ్డుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో ఏం చేశాడనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించగా, మిగతా ముఖ్యమైన పాత్రలలో ఆర్య .. ముఖేశ్ రుషి .. నవాజుద్దీన్ సిద్ధికీ .. జిషు సేన్ గుప్తా .. రుహాని శర్మ .. ఆండ్రియా కనిపించనున్నారు.

Saindhav
Venkatesh Daggubati
Shraddha Srinath
Arya

More Telugu News