Hanu Man: 'హను మాన్' నుంచి రామదూత స్తోత్రం రిలీజ్!

Hanu Man Movie Update

  • తేజ సజ్జా హీరోగా రూపొందిన 'హను మాన్'
  • ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా  
  • కీలకమైన పాత్రను పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల   


తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ 'హను మాన్' సినిమాను రూపొందించాడు. నిరంజన్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. అమృత అయ్యర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. అందులో భాగంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'రామదూత స్తోత్రం'ను విడుదల చేశారు. 'రం రం రం రక్తవర్ణం .. దినకర వదనం' అంటూ ఈ స్తోత్రం మొదలవుతోంది. గౌర హరి సంగీతాన్ని అందించగా, శ్రీచరణ్ .. లోకేశ్వర్ .. హర్షవర్ధన్ ఆలపించారు.

ఈ కథ అంజనాద్రి ప్రాంతంలోని ఒక గ్రామంలో నడుస్తుంది. హనుమ అనుగ్రహం వలన కథానాయకుడికి కొన్ని శక్తులు సొంతమవుతాయి. తన స్వార్థ ప్రయోజనాల కోసం అలాంటి శక్తులను దక్కించుకోవడానికి ప్రతినాయకుడు రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఏం జరుగుతుందనేదే కథ. 

Hanu Man
Teja Sajja
Amrutha
Varalakshmi Sharath Kumar

More Telugu News