south indian railway: ప్రయాణికులకు శుభవార్త... జనవరి 7 నుంచి సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
- రద్దీని దృష్టిలో పెట్టుకొని 32 రైళ్లను నడపనున్నట్లు ప్రకటన
- జనవరి 27వ తేదీ వరకు వివిధ తేదీల్లో.. వివిధ మార్గాల్లో రైళ్లు
- అందుబాటులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని 32 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27వ తేదీ వరకు వివిధ తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి రైళ్ల రాకపోకలు ఉండనున్నాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు ఇవే... సికింద్రాబాద్ - బ్రహ్మపూర్, బ్రహ్మపూర్ - వికారాబాద్, విశాఖపట్నం - కర్నూలు, శ్రీకాకుళం - వికారాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ - కాకినాడ టౌన్, సికింద్రాబాద్ - నర్సాపూర్ మార్గాల్లో రైళ్లు నడవనున్నాయి.