Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కొత్తగూడెం ఎమ్మెల్యే

CPI leaders meet CM Revanth reddy

  • ఎమ్మెల్యే సహా సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీపీఐ నాయకులు
  • ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నేతల విజ్ఞప్తి
  • ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని వెల్లడి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో సీపీఐ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, ఇతర నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేసే ప్రతి పనిలో ప్రభుత్వానికి తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సీపీఐ నాయకులు తెలిపారు.

Revanth Reddy
CPI Narayana
CPI Ramakrishna
Telangana
  • Loading...

More Telugu News