YS Sharmila: నేడు ఇడుపులపాయకు వెళ్తున్న వైఎస్ షర్మిల

YS Sharmila is going to Idupulapaya

  • షర్మిల ఇంట్లో ప్రారంభమైన పెళ్లి సందడి
  • ప్రియతో షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి
  • ఫిబ్రవరి 17న వివాహ వేడుక

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నేడు కుటుంబ సమేతంగా కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ ను దర్శించుకోనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహం చేస్తున్నట్టు ఆమె నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరిపించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ నెల 18న నిశ్చితార్థ వేడుక ఉంటుందని... ఫిబ్రవరి 17న వివాహ వేడుక ఉంటుందని ఆమె చెప్పారు. 

ఈ నేపథ్యంలో కాబోయే వధూవరులు, కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల ఈరోజు ఇడుపులపాయకు వెళ్తున్నారు. వివాహ ఆహ్వాన తొలి పత్రికను తన తండ్రి సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోనున్నారు. మరోవైపు, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన రాజారెడ్డి, ప్రియ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం జరగనుంది.

YS Sharmila
YSRTP
Son
Raja Reddy
Marriage
Idupulapaya
  • Loading...

More Telugu News