madhapur: మాదాపూర్‌లో ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
![Fire accident in Madhapur hotel](https://imgd.ap7am.com/thumbnail/cr-20240101tn6592e8e759da5.jpg)
- హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో చెలరేగిన మంటలు
- మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పోలీసులు, చుట్టుపక్కల స్థానికులు అప్రమత్తమయ్యారు.