bandla ganesh: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నిర్మాత బండ్ల గణేశ్

Bandla Ganesh meets CM Revanth Reddy

  • నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గణేశ్  
  • పూల మొక్కను బహూకరించిన సినీ నిర్మాత
  • ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన సీఎంవో సిబ్బంది

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సరం సందర్భంగా ఓ పూలమొక్కను బహుమతిగా అందించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎంవోలోని సిబ్బంది కూడా... ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

bandla ganesh
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News