Kesineni Nani: నేను గానీ, నా కుటుంబ సభ్యులు గానీ విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయడంలేదు: కేశినేని నాని

Kesineni Nani comments on Vijayawada west constituency

  • ఆసక్తికరంగా బెజవాడ రాజకీయాలు
  • విజయవాడ పశ్చిమ సీటు ఈసారి బీసీ లేదా మైనారిటీలదన్న నాని
  • తాను విజయవాడ పార్లమెంటు స్థానానికి కాపలా కుక్కలాంటి వాడ్నని వ్యాఖ్యలు

బెజవాడ రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనారిటీలదని అన్నారు. తాను విజయవాడ పార్లమెంటు స్థానానికి కాపలా కుక్కలాంటివాడ్నని పేర్కొన్నారు. తాను టీడీపీలో లేకుండా ఉంటే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని జగ్గయ్యపేట నుంచి దోచుకోవచ్చనేది కొందరి ఆలోచన అని కేశినేని నాని వ్యాఖ్యానించారు.

Kesineni Nani
Vijayawada West
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News