Hyderabad: కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి ఘటన... హోటల్‌కు నిప్పు పెడతామంటూ రాజాసింగ్ హెచ్చరిక

Raja Singh warning on attack on hotel

  • దూల్‌పేట వాసులపై దాడి చేసిన అబిడ్స్ హోటల్ సిబ్బంది
  • దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్
  • హోటల్ యజమానితో పాటు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలన్న రాజాసింగ్

అబిడ్స్ గ్రాండ్ హోటల్‌లో కస్టమర్ల మీద... సిబ్బంది దాడి చేసిన ఘటనపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. దాడికి గురైన కస్టమర్లు దూల్‌పేటకు చెందిన వారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందిస్తూ... గ్రాండ్ హోటల్‌ లో కస్టమర్లపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్ యజమానితో పాటు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని అబిడ్స్ పోలీస్ స్టేషన్ సీఐని డిమాండ్ చేశారు. లేదంటే హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దూల్‌పేటకు చెందిన ఓ కుటుంబం నిన్న అబిడ్స్ గ్రాండ్ హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే ఆ బిర్యానీ సరిగ్గా ఉడకలేదని చెప్పడం.. ఆ తర్వాత బిల్లు కట్టే సమయంలో వాగ్వాదం... గొడవ జరిగాయి. ఈ క్రమంలో హోటల్ సిబ్బంది... కస్టమర్లపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనపై రాజాసింగ్ సీరియస్ అయ్యారు.

Hyderabad
hotel
abids
Raja Singh
  • Loading...

More Telugu News