Bhairi Naresh: భైరి నరేశ్ పై మరోసారి దాడికి యత్నించిన అయ్యప్ప భక్తులు

Ayyappa devotees attacked Bairi Naresh

  • ఏటూరునాగారంలో నరేశ్ కారు తగిలి అయ్యప్ప భక్తుడికి గాయం
  • నరేశ్ ను అడ్డుకుని, దాడికి యత్నించిన భక్తులు
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు

గతంలో అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అయ్యప్ప భక్తులతో తన్నులు తిన్న భైరి నరేశ్ కు మరోసారి చేదు అనుభవం ఎదురయింది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో నరేశ్ ను అయ్యప్ప భక్తులు అడ్డుకుని,  ఆయనపై దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళ్తే... ఏటూరునాగారంలోని డియర్ ఫంక్షన్ హాల్లో జరిగిన భీంరావ్ కోరేగావ్ మావేశానికి నరేశ్ వచ్చాడు. అయితే, ఆయన కారు తగిలి ఒక అయ్యప్ప భక్తుడి కాలికి గాయం అయింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన అయ్యప్ప భక్తులు ఆయనపై దాడికి యత్నించారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నరేశ్ జైలుకు వెళ్లాడు. చర్లపల్లి జైల్లో దాదాపు 45 రోజుల పాటు ఉన్న ఆయన ఆ తర్వాత కొడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన హనుమకొండలో మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయంతో అయ్యప్ప భక్తులు ఆయనను చితకబాదారు. ఇప్పుడు మరోసారి ఆయనకు చేదు అనుభవం ఎదురయింది.

Bhairi Naresh
Ayyappa Devotees
  • Loading...

More Telugu News