Chandrababu: కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించిన చంద్రబాబు

Chandrababu inaugurates Anna Canteen at Kuppam bus stand
  • కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • కుప్పం బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ కు ప్రారంభోత్సవం
  • ప్రజల్లో మునుపెన్నడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోందన్న టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో వరుసగా మూడో రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు స్వయంగా భోజనం వడ్డించడం విశేషం. అంతకుముందు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల్లో మునుపెన్నడూ లేనంత ఉత్సాహాన్ని చూస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఊపు చూస్తుంటే వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 

గత 35 ఏళ్లుగా కుప్పం ప్రజలు తనను ఆదరిస్తున్నారని, ఈసారి లక్ష మెజారిటీ అందించి కుప్పం స్థాయిని ఘనంగా చాటాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గతంలో కంటే ఈసారి కుప్పం నియోజకవర్గంలో రెట్టింపు అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Chandrababu
Anna Canteen
Kuppam
TDP
Andhra Pradesh

More Telugu News